ఇవాళ సరే… రేపు నిలబడుతుందా?
దిగువస్థాయి నుంచి నిఫ్టి దాదాపు 400 పాయింట్లు పెరిగినా, బ్యాంక్ నిఫ్టిలో భారీ రికవరీ వచ్చినా… మిడ్ క్యాప్స్ సూచీ మాత్రం నష్టాల్లో ముగిసింది. అలాగే స్మాల్ క్యాప్స్ కూడా. యుద్ధం తరవాత భారీగా క్షీణించిన ఆటో, బ్యాంక్, సిమెంట్ వంటి కొన్ని రంగాల షేర్లు వినా… మిగిలిన రంగాల షేర్లలో పెద్ద ఉత్సాహం లేదు. క్లోజింగ్ సెషన్లో 2.30 నుంచి నిఫ్టిలో కాస్త షార్ట్ కవరింగ్ వచ్చింది. అయితే షార్ట్స్, లాంగ్ అన్‌వైండింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. కేవలం కొన్ని ఎంపిక చేసిన సూచీ ప్రధాన షేర్లు వినా… మిగిలిన షేర్లలో ఒత్తిడి కొనసాగింది. బ్యాంక్ నిఫ్టి, ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ పెరిగాయి. డిఫెన్స్‌తో పాటు రియల్ ఎస్టేట్ రంగాల షేర్లలో ఒత్తిడి కొనసాగింది. 22955 నుంచి కోలుకున్న నిఫ్టి 23502 స్థాయిని తాకినా… క్లోజింగ్‌లో 23408 వద్ద ముగిసింది. నిఫ్టి ఇవాళ 257 పాయింట్లు పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 106.5 డాలర్ల నుంచి 104 డాలర్లకు తగ్గడం వినా… అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద పాజిటివ్ అంశాలు లేవు. అమెరికా ఫ్యూచర్స్ లాభాలు కూడా అర శాతం లోపే ఉన్నాయి. మరి మార్కెట్ రికవరీ మోడ్‌లోకి వచ్చిందా లేదా ఇది ఒక రోజు మెరుపా రేపు చూడాలి. రేపు నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది.
