స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా, ఇపుడు ఆసియా.. ఈక్విటీ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఫెడ్ నిర్ణయం తరవాత అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమైనా… టెక్, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కేవలం జపాన్ నిక్కీ మాత్రమే లాభాల్లో ఉంది.ఈ సూచీ 2.17 శాతం లాభంతో ట్రేడవుతుండగా, ఆస్ట్రేలియా కూడా ఇదే లాభంతో ఉంది. ఇక మిగిలిన మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 1.2 శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా A50, షాంఘై, షాంఘై డౌజోన్స్ కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి మాత్రం స్వల్ప నష్టంతో ఉంది. సో… నిఫ్టి కూడా స్వల్ప నష్టంతో లేదా స్థిరంగా ప్రారంభం కానుంది.