18,000 దగ్గరగా నిఫ్టి
సింగపూర్ నిఫ్టి సూచించినట్లు 157 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే 17,944ని తాకిన నిఫ్టి ఇపుడు 17941 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 154 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు లాభాల్లోఉండగా, నాలుగు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ 2.4 శాతం లాభంతో రూ.4566 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చాలా వరకు ఐటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ రెండు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. చాలా రోజుల తరవాత ఎల్ఐసీ షేర్ 3 శాతంపైగా లాభంతో రూ. 610 వద్ద ట్రేడవుతోంది. ఎల్ఐసీ వాటాదారులకు బోనస్ షేర్లను ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్న వార్తలే దీనికి కారణం. గతవారం భారీగా క్షీణించిన నైకా షేర్ ఇవాళ 2.4 శాతం పెరగడంతో షేర్ ధర మళ్ళీ రూ. 1000 ఎగువకు వచ్చింది. ఇక బ్యాంకింగ్ షేర్లలో బంధన్ బ్యాంక్ నాలుగు శాతంపైగా నష్టంతో ఈ షేర్ ట్రేడవుతోంది. మిడ్ క్యాప్ షేర్లలో చాలా షేర్లు లాభాల్లో ఉన్నాయి. పర్సిస్టెన్స్ షేర్ కూడా 2.6 శాతం పెరిగింది.