For Money

Business News

నిరాశపర్చిన టీసీఎస్‌

డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను టీసీఎస్‌ ప్రకటించింది. ఈ త్రైమాసికం సాధారణంగా ఐటీ కంపెనీలకు పేలవంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు సంవత్సరాంతపు సెలవులో వెళతాను. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టీసీఎస్‌ ఫలితాలు ఒక మోస్తరుగా పెరిగినట్లు కన్పించినా.. గత త్రైమాసికంతో పోలిస్తే మాత్రం నిరాశాజనకంగా ఉన్నట్లే లెక్క. సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌కు ఇచ్చిన సర్వేలో చాలా మంది విశ్లేషకులు కంపెనీ రూ. 59,950 కోట్ల ఆదాయంపై రూ. 11,345 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. అంచనాలకు మించి కంపెనీ రూ. 60,593 కోట్ల ఆదాయంపై రూ. 12,016 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టర్నోవర్‌ కేవలం 1.5 శాతం పెరగ్గా, నికర లాభం 6 శాతం మాత్రమే పెరిగింది. మార్జిన్‌ కూడా స్వల్పంగా పెరిగి 25 శాతానికి చేరింది. కంపెనీ ఒక్కో షేర్‌కు రూ. 27 డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్‌కు రికార్డు తేదీ జనవరి 19 కాగా, ఫిబ్రవరి 5వ తేదీన డివిడెండ్‌ చెల్లిస్తారు. నిజానికి కంపెనీ గైడెన్స్‌ను తగ్గించడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. 1.5 శాతం నుంచి 2 శాతం వరకు మాత్రమే వృద్ధి ఉంటుందని కంపెనీ చెబుతోంది.