For Money

Business News

19,500పైన ముగిసిన నిఫ్టి

ఇవాళ జరిగిన మూరత్‌ ప్రత్యేక ట్రేడింగ్‌లో నిఫ్టి ఆకర్షణీయ లాభాల్లో ముగిసింది. ఇవాళ సాయంత్రం 6.15 నుంచి 7.15 నిమిషాల వరకు జరిగిన ఈ ట్రేడింగ్‌లో దాదాపు ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా రియాల్టి ఇండెక్స్‌ భారీ లాభాలతో ముగిసింది. అలాగే ఫార్మా కూడా. ఐటీ సూచీ ఒక మోస్తరు లాభాలతో ముగిసింది. ఇన్ఫోసిస్‌, విప్రో లాభాల్లో క్లోజయ్యాయి. ఇక నిఫ్టి ఓపెనింగ్‌లోనే 19500 స్థాయిని దాటి 19547 పాయింట్లను తాకింది. అక్కడి నుంచి 19510 పాయింట్లకు స్వల్పంగా తగ్గినా… వెంటనే కోలుకుని వంద పాయింట్ల లాభంతో 19,525 వద్ద ముగిసింది. చివరి 15 నిమిషాల్లో నిఫ్టి ఆపన్షన్స్‌ భారీ మార్పులు జరిగాయి. నిఫ్టి 19500 స్థాయి పైన క్లోజ్‌ కావడంతో అనూహ్యంగా నిఫ్టి పుట్స్‌ ప్రీమియం భారీగా క్షీణించింది. ఇటీవల భారీగా పెరిగిన కౌంటర్లు స్వల్పంగా క్షీణించడంతో నిఫ్టిపై ఒత్తిడి తగ్గింది.