For Money

Business News

మిడ్‌ క్యాప్‌ షేర్ల జోరు

మార్కెట్‌ ఇవాళ ఆరంభంలో నష్టపోయినా… వెంటనే కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉండటంతో సెంటిమెంట్‌ కాస్త మెరుగైంది. ముఖ్యంగా అమెరికాలో ఐటీ, టెక్‌ షేర్లు భారీగా పెరిగాయి. అయితే చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు ఇవాళ దుమ్ము రేపాయి. దీంతో మన మార్కెట్లలో పెద్ద హడావుడి లేదు ఆరంభంలో. కాని క్రమంగా నిఫ్టి బలపడుతూ… 19772 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 107 పాయింట్ల లాభంతో 19753 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి అరశాతం పెరిగినా.. మార్కెట్‌ యాక్టివిటీ పూర్తిగా మిడ్ క్యాప్‌ షేర్లకు పరిమితమైంది. ఈ సూచీ ఇవాళ 1.5 శాతంపైగా పెరగడం విశేషం. బ్యాంక్‌ నిఫ్టి కూడా 0.4 శాతం లాభపడినా.. నిఫ్టి నెక్ట్స్‌ 0.27 శాతం లాభానికే పరిమితమైంది. దిగువ స్థాయి నుంచి నిఫ్టి ఇవాళ దాదాపు రెండు పాయింట్ల దాకా పెరగడం విశేషం. ఇవాళ నిఫ్టిలో చాలా వరకు ప్రభుత్వ రంగ కంపెనీలు రాణించాయి. ఫార్మా షేర్లలో స్వల్ప ఒత్తిడి కన్పిస్తోంది. కాని మిడ్‌ క్యాప్‌ ఫార్మాలో చాలా షేర్లు రాణించాయి. భారీ నష్టాలను ప్రకటించినా… ల్యారస్‌ ల్యాబ్‌ షేర్‌ ఇవాళ నాలుగు శాతంపైగా లాభంతో ముగిసింది.