For Money

Business News

బ్యాంకు షేర్లతో జాగ్రత్త

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల తరవాత ప్రభుత్వ రంగ బ్యాంకులు ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా పెరిగాయి. నిజానికి ఎస్‌బీఐ వంటి పెద్ద బ్యాంకు షేర్లతో పోలిస్తే కొన్ని చిన్న, మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా పెరిగాయి. ఈ విషయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకుల్లో భారీగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణకు ఆస్కారం ఉందని హెచ్చరిస్తున్నారు. గత రెండు నెలల్లో యూనియన్‌ బ్యాంక్‌ ఏకంగా 60 శాతం పెరిగింది. యూకో బ్యాంక్‌ 57 శాతం పెరగ్గా, బ్యాంక్ ఆఫ్‌ ఇండియా 50 శాతం పెరిగింది. అలాగే పీఎన్‌బీ 38 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 30 శాతం పెరిగింది. వీటిలో పీఎన్‌బీ, బీఓబీ మినహా మిగిలిన షేర్లు అత్యధిక ఓవర్‌ బాట్‌ పొజిషన్‌లో ఉన్నాయని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థాయిలో కొత్తగా కొనుగోలు చేసే విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని వీరు హెచ్చరిస్తున్నారు.