For Money

Business News

నిఫ్టికి మెటల్స్‌ అండ

ఉదయం ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా ఇచ్చిన కిక్‌తో మెటల్‌ షేర్లు రెచ్చిపోయాయి. మిడ్‌ సెషన్‌ తరవాత కార్పొరేట్‌ ఫలితాల జోష్‌తో యూరో మార్కెట్లు కూడా అర శాతం దాకా లాభాలతో ట్రేడ్‌ కావడం… నిఫ్టికి కలిసొచ్చింది. వెరశి ఉదయం అనుకున్నట్లు రోలోవర్స్‌ ఇవాళ చాలా ఆశాజనకంగా సాగాయి. నిన్న వచ్చిన భారీ షార్ట్‌ కవరింగ్‌ కారణంగా కోలుకున్న నిఫ్టికి డెరివేటివ్స్‌ క్లోజింగ్స్‌ కారణంగా 15800 వద్ద గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఉదయం స్వల్ప ఒత్తిడి వచ్చినా… మిడ్‌ సెషన్‌ తరవాత మార్కెట్‌ పటిష్ఠంగా సాగింది. బ్యాంక్‌ నిఫ్టి పరవాలేదు. కాని అసలు రారాజు మిడ్‌ క్యాప్‌ షేర్‌. ఈ సూచీ ఒక శాతంపైగా పెరిగింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 458.65 10.17
టాటా స్టీల్‌ 1,458.00 6.81
ఎస్‌బీఐ 443.10 4.14
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 14,516.00 3.90
జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 745.90 3.35

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
మారుతీ 6,999.00 -2.32
పవర్‌గ్రిడ్‌ 167.55 -2.07
బజాజ్‌ ఆటో 3,756.25 -1.63
ఐటీసీ 206.00 -1.48
కోల్‌ ఇండియా 142.05 -1.39