నష్టాలకు బ్రేక్ ఎపుడో?
వరుసగా వారం రోజుల నుంచి నిఫ్టి నిస్తేజంగా ఉంది. ఒకవేళ మార్పు ఉంటే అది నష్టాలే. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అయిపోతున్నాయి. మార్కెట్‌లో మార్పు తెచ్చే ఎలాంటి ట్రిగ్గర్ లేదు. పైగా పశ్చిమాసియా యుద్ధం సుదీర్ఘంగా సాగేలా ఉంది. ఎటు తిరిగి బ్రెంట్ క్రూడ్ 90 డాలర్ల దరిదాపుల్లో ఉంటోంది. పైగా మనదేశంలో ఏఐ లేదు. ఇతర కొత్త జోష్ లేదు. పైగా సెబీ కొత్త ఆంక్షలు, ప్రయోగాలు. దీంతో ట్రేడింగ్‌పై ఆసక్తి కూడా తగ్గుతోంది. ఇవాళ కూడా నిఫ్టి కనీసం 50 పాయింట్ల నష్టంతో ప్రారంభం కానుంది. ఇవాళ 24300 స్థాయి ఉంటుందా? పోతుందా అన్నది చూడాలి. నిఫ్టికి ఈ స్థాయి చాలా కీలకం. లేదంటే నిఫ్టి 23200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మరోవైపు కొత్త పబ్లిక్ ఆఫర్లు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొత్త ఇష్యూలపైనే ఆసక్తి చూపుతున్నారు. దీని ప్రభావం కూడా సెకండరీ మార్కెట్‌పై పడుతోంది. అనేక కీలక కంపెనీల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు బయటపడుతున్నారు. అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. అయితే న్యూ ఏజ్ ఇండస్ట్రీస్‌పై మాత్రం ఇన్వెస్టర్ల ఆసక్తి కన్పిస్తోంది. నాలెడ్జ్ మెరైన్ తాజా ఉదాహరణ. ఈ కౌంటర్‌లో భారీ డీల్స్ కన్పిస్తున్నాయి. పైగా షేరు విభజనకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. సో… నిఫ్టిని వొదిలి… షేర్లపై దృష్టి పెట్టడం మంచిది.
