For Money

Business News

రూ.3 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

అదానీ గ్రూప్‌ సెంటిమెంట్‌తో పాటు బలమైన పీఎంఐ డేటా, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సందేశాలతో ఇవాళ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. మార్చి నెల డెరివేటివ్స్‌కు గట్టి బూస్ట్‌ లభించింది. జీక్యూజీ పార్ట్‌నర్స్‌, గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌తో అదానీ ఒప్పందంతో ఆ గ్రూప్‌ షేర్ల సెంటిమెంట్‌ మెరుగుపడింది. నిఫ్టి ఒకటిన్నర శాతం పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్క సెషన్‌లోనే 3.3 లక్షల కోట్లు పెరిగింది. బ్యాంక్‌ నిఫ్టి రెండు శాతంపైగా పెరగ్గా, పీఎస్‌యూ బ్యాంక్‌ నిఫ్టి అయిదు శాతం పైగా పెరగడం విశేషం. బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 259 లక్షల కోట్ల నుంచి రూ. 263 లక్షల కోట్లకు పెరిగింది. అదానీ గ్రూప్‌లో అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఇవాళ ఏకంగా 17 శాతం పెరిగింది. అయితే ఈ ఉత్సాహం కేవలం తాత్కాలికమేనని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ షేర్ల వ్యాల్యూయేషన్‌ అధికంగా ఉందని, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయని వీరు హెచ్చరిస్తున్నారు.