For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లో పడినా..వెంటనే కోలుకుంది. ఆరంభంలో 17,906ని టచ్‌ చేసిన నిఫ్టి ప్రస్తుతం 17,975 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్ల లాభంతో ఉంది.దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నా…మార్కెట్‌ బలహీనంగా ఉంది. మిడ్‌ క్యాప్‌ సూచీ 0.3 శాతం పెరిగినా… బ్యాంక్‌ నిఫ్టి దాదాపు క్రితం ముగింపు వద్దే ఉంది. నిఫ్టి నెక్ట్స్‌ ఒక్కటే అర శాతం లాభంతో ఉంది. నిఫ్టిలో 31 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. మెటల్స్‌,ఆటో షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. నిఫ్టి ఇవాళ 18,000 దాటే పక్షంలో 18020 – 18040 స్థాయిని దాటుతుందేమో చూడాలి.