మళ్ళీ భారీ అమ్మకాలు… ఎందుకు?
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో మళ్ళీ టెన్షన్ పెరిగింది. దాదాపు అన్ని మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. గత శుక్రవారం నాస్‌డాక్ 2 శాతం నష్టపోయింది. దీంతో ఇవాళ ఫ్యూచర్స్ స్థిరంగా ఉన్నాయి. అయితే పశ్చిమాసియాలో తాజా టెన్షన్, శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ను ఆసియా మార్కెట్లు ఇవాళ డిస్కౌంట్ చేస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో పలు మార్కెట్లు
మూడు శాతం దాకా నష్టంతో ఉన్నాయి. డాలర్ స్థిరంగా ఉన్నా… క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్‌కు అమెరికా 48 గంటల డెడ్‌లైన్ విధించింది. హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాను ధ్వంసం చేస్తామని పేర్కొంది. దీనికి డోంట్‌కేర్ అన్న రీతిలో ఇరాన్ స్పందించింది. అమెరికా తమపై దాడి చేస్తే ఏకంగా పశ్చిమాసియాలో తాగునీరు సరఫరాను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. యుద్ధం తీవ్ర దృష్ట్యా బులియన్ మార్కెట్ భారీగా క్షీణించింది.
