For Money

Business News

ఇరాన్‌కు అంత కెపాసిటీ ఉందా?

డిగో గార్షియాను టార్గెట్‌ చేసుకుని ఇరాన్‌ రెండు క్షిపణులు ప్రయోగించిందన్న వార్తతో ప్రపంచ దేశాలు షాక్‌ తిన్నాయి. ముఖ్యంగా అమెరికా కంగుతింది. ఇరాన్‌కు 4000 కి.మీ. దూరంలో ఉన్న డిగో గార్షియాను ఇరాన్‌ టార్గెట్‌ చేయడమంటే… ప్రపంచంలోని చాలా దేశాల ముఖ్యంగా యూరప్‌ దేశాల రాజధానులను టార్గెట్‌ చేసే క్షిపణులు ఇపుడు ఇరాన్‌ వద్ద ఉన్నాయా అన్న చర్చ నడుస్తోంది. ఇరాన్‌ వద్ద 2000 కి.మీ. దూరంలోని టార్గెట్‌ను ఛేదించే క్షిపణులు ఉన్నాయనేది ప్రపంచ దేశాల అంచనా.అయితే డిగో గార్షియాను టార్గెట్‌ చేయడంతో ఇరాన్‌పై ఇతర దేశాల లెక్కలు తప్పని తేలాయి. ఇరాన్‌ ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి మధ్యలోనే కూలిపోయిందని, రెండో క్షిపణిని అమెరికా నిర్వీర్యం చేసిందని వార్తలు వస్తున్నాయి. బ్రిటన్‌, అమెరికాలకు సైనిక స్థావరమైన డిగో గార్షియాను టార్గెట్‌ చేస్తూ ఇప్పటి వరకు ఎవరూ దాడులు చేయలేదు. డిగో గార్షియాపై 20 ఏళ్ళ నుంచి అమెరికా పెత్తనం ఉంది. అయినా అమెరికా బద్ధ శత్రు దేశాలు కూడా దాడి చేసే సాహసం చేయలేదు. ఇరాన్‌ తాజా చర్యతో హిందూ మహాసముద్రంలోని తన సైనిక స్థావరాలపై అమెరికా మరింత నిఘా పెంచింది. డిగో గార్షియా దాడి తరవాత ప్రపంచ దేశాలు ఏవీ ఇప్పటి వరకు స్పందించలేదు. క్షిపణలు విఫలమైనా… 4000 కి.మీ. దూరంలో ఉన్న టార్గెట్‌ను తాకగల క్షిపణి ఇరాన్‌ వద్ద ఉందని ప్రపంచానికి తెలిసింది. మరి అమెరికా ఎలా స్పందిస్తో చూడాలి మరి.

 

Leave a Reply