ఫుల్ జోష్… మరి కొనొచ్చా?
ఇవాళ మన స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానున్నాయి. ఉదయం రెండు శాతం లాభంతో ఉన్న గిఫ్ట్ నిఫ్టి, ఇపుడు 1.6% పైగా లాభంతో ట్రేడవుతోంది. దీంతో ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి నేడు ప్రారంభం కానుంది. ట్రంప్ ప్రకటనతో శాంతించిన బాండ్ మార్కెట్లు శాంతించాయి. ఆసియా మార్కెట్ల ట్రెండ్ మన మార్కెట్లలో కూడా కొనసాగనుంది. ఇవాళ విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సోమవారం నాటి రోల్ఓవర్స్ భయంకరంగా ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా భారీ స్థాయిలో షార్ట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్నాయి.మరి ఎఫ్ఐఐల నుంచి భారీ షార్ట్ కవరింగ్ ఇవాళ వస్తుందా? లేదా క్రమంగా వారు తమ పొజిషన్స్ కవర్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్లో ఉండటంతో ఇవాళ్టి లాభాలు కొనసాగే ఛాన్స్ ఉంది. ట్రంప్ మాటలను నమ్మడం కష్టంగా ఉన్నా… ఆయన చాలా కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయంగా జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన యుద్ధాన్ని విరమిస్తారనే అనలిస్టులు భావిస్తున్నారు. పైగా మార్కెట్ ఈ వారంలో రేపు మాత్రమే పనిచేస్తుంది. ఎల్లుండి సెలవు. మళ్ళీ ట్రేడింగ్ సోమవారమే. అయితే శుక్రవారం ప్రపంచ మార్కెట్లకు సెలవు. కాబట్టి ట్రెండ్ రేపే స్పష్టం కావొచ్చు. యుద్ధం తరవాత భారీగా క్షీణించిన ఎల్ అండ్ టీ వంటి క్యాపిటల్ గూడ్స్ షేర్లలో మంచి రివకరీ రావొచ్చు. అలాగే తీవ్ర వేసవి మున్ముందు ఉన్నందున బ్లూస్టార్, ఓల్టాస్ వంటి షేర్లలో కవరింగ్ రావొచ్చు. అయితే ఇవాళ్టి క్లోజింగ్ ఈ రికవరీకి బలం ఉందా లేదా అన్నది తేలనుంది. నిఫ్టి గనుక ఇవాళ్టి లాభాలను కాపాడుకుంటే… ర్యాలీకి సంకేతంగా భావించవచ్చు.
