For Money

Business News

ప్రజలకు ఒరిగిందేమీ లేదు

ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరవాత క్రూడ్‌ మార్కెట్‌ ముఖచిత్రం మారిపోయింది. నాటో కూటమితో పాటు అమెరికా దేశాలు రష్యాపై అనేక రకాల ఆంక్షలను విధించాయి. ఒక్కసారి సారిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రష్యా… ఏదో విధంగా బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. మార్కెట్‌ ధర కన్నా 30 శాతం డిస్కౌంట్‌తో భారత్‌కు క్రూడ్‌ ఆయిల్‌ ఇస్తానని ఆఫర్‌ చేసింది. భారత్‌ కూడా సరేనంది. భారత్‌కు చెందిన ప్రభుత్వం, ప్రైవేట్‌ కంపెనీలకు కూడా రష్యా నుంచి డిస్కౌంట్‌కు క్రూడ్‌ ఆయిల్‌ను కొంటున్నాయి. నయార ఎనర్జి (ఎస్సార్‌ ఆయిల్) కూడా 30 శాతం డిస్కౌంట్‌తో ఆయిల్‌ను కొంటోంది. కాని మార్కెట్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీలు మాత్రం ధరలు తగ్గించడం లేదు. ప్రజల నెత్తిన భారీ భారం వేసి… ప్రైవేట్‌ కంపెనీలు కూడా కోట్ల రూపాయల లాభాన్ని మూటగట్టుకుంటున్నాయి. రష్యా నుంచి డిస్కౌంట్‌పై క్రూడ్‌ను కొనుగోలు చేస్తున్న కంపెనీలు…

ట్రాఫిగురా ట్రేడర్‌ నుంచి భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) 20 లక్షల బ్యారెల్స్‌ రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేసింది. తన అనుబంధ కంపెనీ అయిన కోచి రిఫైనరీ కోసం ఈ కంపెనీ క్రూడ్‌ కొంటోంది.

హిందుస్థాన్‌ పెట్రోలియం కూడా మే డెలివరీ కోసం 20 లక్షల బ్యారెళ్ళ రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేసింది.

ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల బ్యారెల్స్‌ను రష్యా ప్రభుత్వ చమురు కంపెనీ రాస్‌నెఫ్ట్‌ నుంచి కొనుగోలు చేసింది. 1.5 కోట్ల బ్యారెల్స్‌ కొనుగోలుకు రాస్‌నాఫ్ట్‌తో ఇండియన్‌ ఆయిల్‌ ఒప్పందం చేసుకుంది.
మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ కూడా పది లక్షల బ్యారెల్స్‌ రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేసింది.

ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా జూన్‌ వరకు నెలకు 50 లక్ష బ్యారెల్స్‌ చొప్పున అంటే మూడు నెలలకు 1.5 కోట్ల బ్యారెల్స్‌ రష్యా క్రూడ్‌ను కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

భారత్‌లో పెట్రోల్‌ బంకులు నడుఉతున్న రష్యా కంపెనీ నయారా ఎనర్జి (పాత ఎస్సార్‌ ఆయిల్‌) 18 లక్షల బ్యారెల్స్‌ రష్యా క్రూడ్‌ను కొనుగోలు చేసింది. తక్కువ రేటుకు కొనుగోలు చేసినా..ఈ కంపెనీ మార్కెట్‌ రేటుకు అమ్ముతోంది.
ఇలా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కూడా తక్కువ ధరకు ముడి చమురు కొంటున్నా… మార్కెట్‌లో మాత్రం అదే ధరకు అమ్మతున్నాయి.