For Money

Business News

అదరగొట్టిన జీడీపీ వృద్ధి రేటు

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వేత్తల అంచనాలకు భిన్నంగా జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా 6.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.1 శాతం ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేయగా, 5.5 శాతం ఉంటుందని ఎస్‌బీఐ రీసెర్చి పేర్కొంది.అయితే వీటి అంచనాలను మించి వృద్ధి రేటు నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ స్థిరంగా ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వ వ్యయం కూడా భారీగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.