For Money

Business News

ఎగుమతులు ఢమాల్‌

అమెరికా టారిఫ్‌ ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా పడింది. మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులు 37.5 శాతం క్షీణించాయి. ఇటీవలి కాలంలో భారత్‌ ఎగుమతులు ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి అని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌ వెల్లడించింది. భారత్‌ నుంచి అత్యధిక ఎగుమతులు అమెరికాకే వెళతాయి.అయితే ఈ ఎగుమతులపై ఏప్రిల్‌ నుంచి పది శాతం, ఆగస్టు నుంచి 25 శాతం చొప్పున అమెరికా విధించింది. తరవాత దీన్ని 50 శాతానికి పెంచింది. దీంతో కేవలం అయిదు నెలల్లో 880 కోట్ల డాలర్ల నుంచి 550 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గతంలో అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల్లో మూడోవంత వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండేవికావు. సుంకాలతో భారత్‌ నుంచి అమెరికాకు షిప్‌మెంట్‌లు 47 శాతం తగ్గాయంటే… పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమౌతుంది. వీటి షిప్‌మెంట్‌ల విలువ 340 కోట్ల డాలర్ల నుంచి 140 డాలర్లకు పడిపోయాయి. సుంకాల వల్ల బాగా దెబ్బతిన్న రంగాల్లో స్మార్ట్‌ఫోన్లు, ఫార్మా ఎగుమతులు ఉన్నాయి. గత ఏడాది 197 శాతం పెరిగిన స్మార్ట్‌ ఫోన్‌ ఎగుమతులు… 2024 ఏప్రిల్‌ నుంచి 2025 సెప్టెంబర్‌ మధ్య కాలంలో కేవలం 58 శాతం వృద్ధి మాత్రమే నమోదు అయింది.

Leave a Reply