ఐసీఐసీఐ బ్యాంక్ కీలక ప్రకటన
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీ లిస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. డీ లిస్ట్ తరవాత ఈ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకుకు పూర్తి అనుబంధ సంస్థగా మారనుంది. అంటే ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ టేకోవర్ చేయనుంది. ఇది విలీనంలా కన్పించినా … విలీనం కాదని పేర్కొంది. ఈ టేకోవర్‌కు సంబంధించి బ్యాంక్ ఇవాళ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వాటాదారుల వద్ద ప్రతి వంద షేర్లకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన 67 షేర్లను కేటాయించనున్నట్లు వెల్లడించింది. గురువారం ఈ డీలిస్టింగ్ ప్రతిపాదనకు రెండు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి. రానున్న 12-15 నెలల్లో ఈ విలీన ప్రక్రియ పూర్తి కానుంది.