For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో భారీ డీల్‌

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో… ఈ రెండు కంపెనీల్లో పలు మార్పులు జరుగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 50 శాతం మించి వాటా కొనుగోలు చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీకి సెబీ నుంచి అనుమతి లభించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో హెచ్‌డీఎఫ్‌ ఇవాళ 1.5 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌ను రూ. 667.10 ధరకు కొన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇవాళ ఎన్‌ఎస్‌సీలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 5.5 శాతం లాభంతో రూ. 664.90 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. తాజా కొనుగోలుతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 49.35 శాతానికి చేరింది. మరో 1.4 కోట్ల షేర్లను కొనుగోలు చేస్తే వాటా 50 శాతాన్ని దాటనుంది. విలీనం తరవాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ అనుబంధ సంస్థగా కొనసాగనుంది.