For Money

Business News

ఫెడరల్‌ బ్యాంక్‌కు గుడ్‌ న్యూస్‌

ఫెడరల్ బ్యాంక్‌లో 9.95 శాతం వరకు వాటా కొనుగోలు చేయాలన్న ఐసీఐసీఐ ప్రెడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రతిపాదనకు రిజర్వు బ్యాంక్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమకు సమాచారం అందిందని ఫెడరల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఫిన్‌ టెక్‌ కంపెనీలతో జతకట్టడం వల్ల తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశముందని ఫెడరల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ శ్యామ్‌ శ్రీనివాసన్‌ అన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫెడరల్‌ బ్యాంక్‌కు 1408 శాఖలు ఉన్నాయి.