For Money

Business News

బంగారం డబుల్‌ అవుతుంది

బులియన్‌ మార్కెట్‌లో ర్యాలీ ఎలా ఉంటుందో ఇన్వెస్టర్లు గత ఏడాది అనుభవంలోకి వచ్చింది. ఈ ఏడాది ఆ ర్యాలీ పీక్‌కు చేరిందని అనుకుంటున్నాం. అయితే గల్ఫ్‌ యుద్ధంతో మళ్ళీ మార్కెట్‌లో చలనం వచ్చింది. 5000 డాలర్ల వద్ద ఔన్స్‌ బంగారం కదలాడుతోంది. ఇప్పటికే 5600 డాలర్ల స్థాయిని తాకడంతో ఇపుడు చిన్న కరెక్షన్‌గా భావిస్తున్నాం. అయితే ఈ ఏడాది చివరికల్లా ఔన్సుకు 6,000 డాలర్లకు చేరుతుందని యార్డెని రీసెర్చ్ సంస్థ అధ్యక్షుడు అయిన ఎడ్వర్డ్ యార్డెని అంటున్నారు. యుద్ధం గనుకు దీర్ఘకాలం కొనసాగే పక్షంలో దశాబ్దం చివరి నాటికల్లా ఔన్సు బంగారం 10,000 డాలర్లకు చేరుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆయన ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌తో మాట్లాడారు. గల్ఫ్‌ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం కల్గుతుందని ఆయన అన్నారు. దీంతో కమాడిటీ మార్కెట్‌లో అప్‌వర్డ్‌ సైకిల్‌ ప్రారంభమౌతుందని అన్నారు. ఇప్పటి వరకు బంగారాన్ని కేవలం ఒక సురక్షిత పెట్టుబడిగా మాత్రమే చూస్తూ వచ్చామని, మున్ముందు పెరిగే అధిక ధరల నుంచి రక్షణగా కూడా బంగారం ఉపయోగం పడుతుందని ఎడ్వర్డ్‌ అన్నారు. ఇతర వస్తువుల ధరల్లో ద్రవ్యోల్బనానికి బంగారం ఒక సూచిక అని ఆయన అన్నారు. గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. దీనింతో పాటు అల్యూమినియం, ఎరువుల ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయని ఆయన అన్నారు. ఎందుకంటే యుద్ధం కారణంగా ఏర్పడిన సరఫరా అడ్డంకుల వల్ల వీటి ధరలు బాగా పెరుగుతాయని అన్నారు. దీని ప్రభావం ఇతర వస్తువులపై కూడా ఉంటుందని, ఆహార పదార్థాలు, వినియోగదారుల ధరలపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని యార్డెనీ హెచ్చరించారు.
కొన్ని నెలల పాటు చమురు ధరలు అధికంగానే పక్షంలో… ఎరువుల తయారీకి అవసరమైన రసాయనాలు దొరకడం కష్టమని ఆయన అన్నారు. రైతులు నాట్లు వేసే కాలంలో చాలా ఖరీదైన ఎరువులను వాడాల్సి వస్తుంది. వాటి కొరత వల్ల దిగుబడులు తగ్గిపోతాయని ఆయన చెప్పారు. దీని ప్రభావం మున్ముందు ఉంటుందని తెలిపారు.
అధిక ధరల ఒత్తిడి తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన సుంకాల్లో కొన్నింటిని తగ్గించే ప్రయత్నం చేయొచ్చని ఎడ్వర్డ్‌ అన్నారు. అమెరికా సుంకాల కారణంగా ఉక్కు, రాగి మరియు అల్యూమినియం ధరలు పెరిగాయి. ధరలు తగ్గాలంటే ముందుగా వీటి ధరలు తగ్గాల్సి ఉంటుంది. పైగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. దీని దృష్ట్యా, వస్తువుల ధరలు అందుబాటులో ఉండేలా చూడటం కోసం ట్రంప్‌ తాను విధించిన కొన్ని సుంకాలను తగ్గించవచ్చని ఆయన అన్నారు.

Leave a Reply