For Money

Business News

30 % తగ్గిన దుబాయ్‌ రియల్‌ఎస్టేట్‌

గల్ఫ్‌ యుద్ధం దుబాయ్‌పై తీవ్రంగా పడుతోంది. గల్ఫ్‌ దేశాల్లో ట్రేడ్‌ సెంటర్‌గా ప్రసిద్ధి చెందిన దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ గత రెండేళ్ళుగా జెట్‌ స్పీడుతో దూసుకుపోయింది. అయితే ఇరాన్‌ దాడుల తరవాత ఒక్కసారిగా పతన బాట పట్టింది. యుద్ధం తరవాత దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ సూచీ DFM రియల్‌ ఎస్టేట్‌ 30 శాతం తగ్గింది. 2026 ఆరంభం నుంచి ఇప్పటి వరకు వచ్చిన లాభాలు కరిగిపోయాయి. యుద్ధం ప్రారంభానికి ముందు 16,800 పాయింట్లు ఉన్న ఈ సూచీ ఇపుడు 11,700లకు పడిపోయింది. అంటే 30 శాతంపైగా తగ్గిందన్నమాట. 2024లో ఈ సూచీ రికార్డుస్థాయిలో 63 శాతం పెరగ్గా, గత ఏడాది అంటే 2025లో 30 శాతం పెరిగింది. ఈ ఏడాది మరో 30 శాతం పెరిగింది. తాజా పతనంతో సూచీ 2025 చివరినాటి స్థాయికి చేరింది. కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధం తరవాత అనేక యూరప్‌ దేశాలు, రష్యాతో పాటు పలు ఆసియా దేశాల పారిశ్రామిక సంస్థలు భారీ ఎత్తున దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టాయి. యుద్ధం ముగిసిన తరవాత వెంటనే రియల్‌ ఎస్టేట్‌ పుంజుకుంటుందని దుబాయ్‌ అంటోంది.

Leave a Reply