డీప్‌సీక్ నిషేధంపై కోర్టు సలహా

చైనాకు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్ డీప్‌సీక్‌ను నిషేధించాలంటూ వేసిన పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటీషన్ గతంలోనే విచారణకు వచ్చింది… దీనిపై కేంద్ర వైఖరి తెలపాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే డీప్‌సీక్ అంశం చాలా సున్నితమైనదని… తన కేసును వెంటనే దర్యాప్తు చేయాలంటూ పిటీషన్ వేశారు. దీన్ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికంటే సున్నితమైన, ప్రధాన అంశాలు చాలా ఉన్నాయని.. దీన్ని వెంటనే విచారించాల్సిన పనిలేదని చీఫ్ జస్టిస్ డీకే ఉపధ్యాయ అన్నారు. సదరు పిటీషన్‌ను తిరస్కరించారు. ఇప్పటికే డీప్‌సీక్ వంటి అనేక ప్లాట్‌ఫామ్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒకవేళ డీప్‌సీక్ వల్ల చాలా ప్రమాద ఉందని భావిస్తే… వాటి జోలికి వెళ్ళవద్దని జస్టిస్ ఉపధ్యాయ సలహా ఇచ్చారు.