For Money

Business News

క్రెడిట్‌ కార్డు లిమిట్స్‌ తగ్గాయి

మీరు గమనించారా? మీ క్రెడిట్‌కార్డు లిమిట్‌ను బ్యాంకులు తగ్గించాయని. దేశ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. జనం క్రెడిట్‌ కార్డుల ద్వారా తీసుకున్న మొత్తాన్ని క్లియర్‌ చేయలేకపోతున్నారు. 2019 మార్చి నాటికి క్రెడిట్‌కార్డుదారులు చెల్లించాల్సిన బకాయి మొత్తం రూ. 90వేల కోట్లు ఉండగా, ఈ ఏడాది జూన్‌ నెల చివరి నాటికి ఈ బకాయిల మొత్తం రూ. 2.7 లక్షల కోట్లకు చేరింది. ఇపుడు రూ. 3 లక్షల కోట్లను అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో క్రెడిట్‌ కార్డుల డీఫాల్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ విషయం మైక్రో క్రెడిట్‌ మార్కెట్‌లో కన్పిస్తోంది. ఈ రంగంలో ఎన్‌పీఏలు బాగా పెరుగుతున్నాయి. అలాగే అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ అయిన క్రెడిట్‌ కార్డుల డిఫాల్ట్‌లు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు జాగ్రత్త పడుతున్నాయి. కార్డు దారులు క్రెడిట్‌ రికార్డు, సిబిల్‌ స్కోర్‌లను పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే కార్డుదారుల క్రెడిట్‌ లిమిట్‌ను బ్యాంకులు తగ్గిస్తున్నాయి. దీనివల్ల రిస్క్‌ తగ్గుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి. కనీసం సిబిల్‌ స్కోరు 750పైన ఉండాలని, 720 కన్నా తక్కువ ఉన్న ఖాతాదారులకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు పునరాలోచన చేస్తున్నాయి. మార్ట్‌గేజ్‌ రుణాల విషయంలో కూడా లోన్‌ టు వ్యాల్యూ (LTV)ని కూడా బ్యాంకులు తగ్గిస్తున్నాయి.

Leave a Reply