విమాన చార్జీలు ఇక ఇష్టారాజ్యం
దేశీయంగా విమాన చార్జీలపై ఉన్న పరిమితులను కేంద్రం పూర్తిగా ఎత్తేసింది. ఇక నుంచి ఆయా విమాన కంపెనీలు తమ ఇష్టమొచ్చిన రేట్లను ఖరారు చేసుకోవచ్చు. ఇంధన చార్జీలు పెరిగిన నేపథ్యంలో చార్జీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు. ఇండిగో సంక్షోభం సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన చార్జీలపై ఆంక్షలు విధించింది. టికెట్ ధర రూ. 18000 దాటరాదని పేర్కొంది. యూడీఎఫ్, ప్యాసింజర్ సెక్యూరిటీ ఫీజు, ట్యాక్సులను అదనంగా వసూలు చేసుకోవచ్చిన గత ఏడాది డిసెంబర్ 6న ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. రేపటి నుంచి ఎయిర్‌లైన్స్ తమ ఇష్టమొచ్చిన చార్జీలు వసూలు చేసుకోవచ్చు. ఏటీఎఫ్ పెరగడం, డాలర్‌తో రూపాయి విలువ తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.
