రూ. 12 లక్షల కోట్ల షాక్
ఒకే ఒక సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ. 12 లక్షల కోట్లు తగ్గింది. నిన్న బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 438 లక్షల కోట్లు కాగా, ఇవాళ రూ. 426 లక్షల కోట్లకు పడిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో ముడిచమురు ధరల భగ్గుమన్నాయి. గత మూడు సెషన్ల లాభాలు ఇవాళ్టి ఒకే ఒక్క సెషనల్‌లో తుడిచిపెట్టుకు పోయాయి. సెన్సెక్స్ 2,496.89 పాయింట్లు (3.26 శాతం) నష్టంతో 74,207.24 వద్ద… నిఫ్టీ 775.65 పాయింట్లు (3.26 శాతం) క్షీణించి 23,002.15 వద్ద ముగిశాయి. ఈ రెండు బెంచ్‌మార్క్ సూచీలు గత మూడు సెషన్లలో సాధించిన మొత్తం లాభాలను కోల్పోయాయి.
బ్యాంక్ ఛైర్మన్‌గా అతను చక్రవర్తి రాజీనామాతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు ఒకదశలో 9% పడిపోయాయి. కంపెనీ ఇన్వెస్టర్లు రూ. 1.03 లక్షల కోట్లు నష్టపోయారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి 119 డాలర్లను తాకాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఎఫ్‌ఐఐ అమ్మకాల పరంపర ఇవాళ కూడా కొనసాగింది. దీంతో USD INR ఆల్‌టైమ్ సరికొత్త కనిష్ట స్థాయికి పడిపోయాయి.
