For Money

Business News

భాసిన్‌ బ్లాక్‌బస్టర్‌ బెట్స్‌

ఫండమెంటల్స్‌ పరంగా బలంగా ఉన్న రెండు షేర్లను ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్ ఛైర్మన్‌ సంజీవ్‌ భాసిన్‌ రెకమెండ్‌ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈటీ నౌ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ ఈ షేర్లను సిఫారసు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఎఫ్‌ఎస్‌ఐ రంగం బాగా రాణిస్తోందని ఆయన అన్నారు. టెక్‌ మహీంద్రా కొనుగోలు భాసిన్‌ రెకమెండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 1026 వద్ద ట్రేడవుతోంది. బ్రిటీష్‌ టెలికామ్‌తో ఈ కంపెనీ ఒప్పందం ప్రయోజనకరంగా ఉందని.. వారం రోజుల్లో ఈ షేర్‌ రూ.1089 లేదా 1095నను తాకుతుందని చెప్పారు. ఈ ట్రేడ్‌కు రూ. 1000 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని సూచించారు. ఇక ఆయన రెకమెండ్‌ చేసిన రెండో షేర్‌ ఎస్‌ఆర్‌ఎఫ్‌. చైనాలో కోవిడ్‌ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీకి చాలా ప్రయోజనకరంగా మారుతుందని ఆయన చెబుతున్నారు. ఈ షేర్‌ ఇపుడు రూ. 2322 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ కూడా వారం రోజుల్లో రూ. 2375 లేదా రూ. 2385ని టచ్‌ చేస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ షేర్‌కు రూ. 2320 లేదా 2310ని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవచ్చని అన్నారు.