For Money

Business News

ఏథర్‌ ఐపీఓ పూర్తి వివరాలు ఇవే…

ఈవీ తయారీ కంపెనీ ఏథర్‌ ఎనర్జి పబ్లిక్‌ ఆఫర్‌ రేపు ప్రారంభం కానుంది. ఈనెల 30వ తేదీన ముగియనుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఈవీ కంపెనీ మహారాష్ట్రలో కొత్త ప్లాంట్‌ నెలకొల్పే ప్రధాన లక్ష్యంతో ప్రైమరీ మార్కెట్‌కు వస్తోంది. ఈ ఆఫర్‌లో తాజా షేర్ల జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్ల తమ వాటాలో కొంత భాగాన్ని ఈ ఆఫర్‌లో విక్రయిస్తున్నారు. ఒక్కో షేర్‌ ముఖ విలువ కేవలం ఒక్క రూపాయి మాత్రమే. ఐపీఓ వివరాలు

ఐపీఓ ప్రారంభం : ఏప్రిల్‌ 28
ఐపీఓ ముగింపు : ఏప్రిల్‌ 30
ముఖ విలువ : రూ. 1
ధరల శ్రేణి : రూ. 304 నుంచి రూ. 321
లాట్‌ సైజు : 46 షేర్లు
మొత్తం ఇష్యూ : 9,28,67,945 షేర్లు
(ఇష్యూ మొత్తం రూ. 2,981.06 కోట్లు)
తాజా షేర్లు :8,18,16,199 షేర్లు
(విలువ రూ. 2,626.30 కోట్లు)
ఆఫర్‌ ఫర్‌ సేల్‌ : 1,10,51,746 షేర్లు
(విలువ రూ. 354.76 కోట్లు)
ఉద్యోగులకు డిస్కౌంట్‌ : రూ.30
ఇష్యూ ముందు షేర్లు : 29,06,43,469
ఇష్యూ తరవాత షేర్లు :37,24,59,668
…..
ఐపీఓ టైమ్‌టేబుల్‌

ఇష్యూ ప్రారంభం : ఏప్రిల్‌ 28
ఇష్యూ ముగింపు : ఏప్రిల్‌ 30
తాత్కాలిక అలాట్‌మెంట్‌ : మే 2
రీఫండ్‌ : మే 5
డిమాట్‌ ఖాతాల్లో షేర్లు జమ :మే 5
లిస్టింగ్‌ : మే 6

అప్లికేషన్లు… లాట్‌ సైజ్‌

రీటైల్‌ (కనీసం) : ఒక లాట్‌ (46 షేర్లు అంటే రూ. 14,766)
రీటైల్‌ (గరిష్ఠం) : 13 లాట్లు (598 షేర్లు అంటే రూ.1,91,958)
S-HNI (కనీసం): 14 లాట్లు (644 షేర్లు అంటే రూ. 2,06,724)
S-HNI (గరిష్ఠం) :67 లాట్లు (3,082 షేర్లు అంటే రూ. 9,89,322)
B-HNI (కనీసం) :68లాట్లు (3,128 షేర్లు అంటే రూ. 10,04,088)
ప్రమోటర్లు : తరుణ్‌ సంజయ్‌ మెహతా, స్వప్నిల్‌ బబన్‌ లాల్‌ జైన్‌, హెచ్‌ఎంసీఎల్‌
ఇష్యూ ముందు ప్రమోటర్ల వాటా : 54.61%
ఇష్యూ తరవాత ప్రమోటర్ల వాటా : 42.09%