For Money

Business News

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ లాభం రెట్టింపు

మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికిగాను రూ.213.47 కోట్ల నికర లాభాన్ని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌. ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ ప్రకటించిన రూ.104.37 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది. బ్యాంక్‌ ఆదాయం కూడా రూ.1,518.39 కోట్ల నుంచి రూ.1,614.75 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 4.4 శాతం పెరిగి రూ.1409కోట్లకు చేరింది. ఇకపూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ రూ.6356 కోట్ల ఆదాయంపై రూ. 673 కోట్లుగా వెల్లడించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు 80 శాతం లేదా రూ.1.60 డివిడెండ్‌ను ఇవ్వాలని బ్యాంక్‌ బోర్డు సిఫారసు చేసింది.