గ్లాండ్ ఫార్మా లాభం రూ.286 కోట్లు
హైదరాబాద్ కంపెనీ గ్లాండ్ ఫార్మా మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.286 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం కంపెనీ నికర లాభం రూ.260 కోట్లు. ఏడాదిలో నికర లాభం 10 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. మొత్తం ఏడాదికి లాభం 22 శాతం పెరుగుదలతో నికర లాభం రూ.1,212 కోట్లుగా నమోదైంది. కంపెనీ టర్నోవర్ కూడా ప్రస్తుత త్రైమాసికంలో 24 శాతం వృద్ధితో రూ.888 కోట్ల నుంచి రూ.1,103 కోట్లకు చేరింది. మొత్తం ఏడాదికి రూ.4,401 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.522 కోట్ల పెట్టుబడులు పెట్టింది.