NIFTY TODAY: పడితే కొనొచ్చు
అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిస్తే.. ఆసియా ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. చైనా మినహా. నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కానుంది. ఈ స్థాయిలో కాకుండా… పడినపుడు కొనుగోలు చేయాలని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. టెక్నికల్స్ సెల్ సిగ్నల్స్ ఇస్తున్నా నిఫ్టి ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. కాబట్టి నిఫ్టిలో డే ట్రేడింగ్ పరిమితం కావాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు.
నిఫ్టి ఇవాళ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 15986
రెండో ప్రతిఘటన 15929
తొలి ప్రతిఘటన 15892
నిఫ్టికి కీలకం 15869
తొలి మద్దతు 15673
రెండో మద్దతు 15635
డౌన్ బ్రేకౌట్ 15573