ఓలా సీఈఓ రాజీనామా?
ఓలా కార్స్ సీఈఓ అరుణ్ సిర్దేష్ముక్ కంపెనీ నుంచి వైదొలగనున్నారు. ఆయనతో పాటు గ్రూప్ స్ట్రాటజీ చీఫ్ అమిత్ ఆంచల్ కూడా రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఓ ప్రణాళికలు పదే పదే వాయిదా పడటంతో పాటు ఓలా ఎలక్ర్టిక్ వాహనాలపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ కంపెనీ నుంచి రాజీనామా చేయడం మార్కెట్లో సంచలనం కల్గిస్తోంది. ఐపీఓ పూర్తయ్యేంత వరకు కొనసాగాల్సిందిగా యాజమాన్యం కోరినా.. రాజీనామాకు అరుణ్ మొగ్గుచూపినట్ల తెలుస్తోంది. సీఈఓ రాజీనామా మాట నిజమేనని చెప్పిన ఓలా అధికారులు…అమిత్ ఆంచల్ రాజీనామా వార్తను ఖండించారు.