For Money

Business News

ఇవాళ డే ట్రేడర్స్‌కు ఛాన్స్‌ – అశ్విని

ఇవాళ మార్కెట్‌ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. గత కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్న సపోర్ట్‌ లెవల్‌కు ఇవాళ నిఫ్టి వస్తుందని స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్గి గనుక ఇవాళ ఓపెనింగ్‌లో 17200 లేదా 17250 ప్రాంతానికి వస్తే… ఇప్పటికే పుట్స్‌ కొన్నవారు… ఓపెనింగ్‌లోనే లాభాలు స్వీకరించడం మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. అలాగే రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో కాల్‌ కొనుగోలు చేయమని ఆయన అంటున్నారు. ఇవాళ మార్కెట్‌లో గట్టి పుల్‌ బ్యాక్‌ వస్తుందని… డే ట్రేడర్స్‌ దిగువస్థాయిలో కొని… అధిక స్థాయిలో అమ్మొచ్చని అన్నారు. మార్కెట్‌ గత బుధవారం కనిష్ఠ స్థాయి 17450 ప్రాంతానికి చేరే అవకాశముందని ఆయన అంటున్నారు. దిగువ స్థాయిలో కాల్స్‌ కొన్నవారు… 17450 దాకా ఆగకుండా.. ముందే బయటపడటం మంచిదని అన్నారు. 17450 ప్రాంతంలో మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వస్తుందని అన్నారు. ఆ స్థాయిలో పుట్స్‌ కొనుగోలు చేయొచ్చని అన్నారు. నిఫ్టి బ్యాంక్‌ కూడా ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కానుందని.. 36800కి రావొచ్చని అశ్విని అభిప్రాయ పడ్డారు. మద్దతు లభించినా 37400కి మించి పెరగకపోవచ్చని ఆయన అంటున్నారు. లెవల్స్‌లో చూసి డే ట్రేడర్స్‌ ట్రేడ్‌ చేయాలని సూచించారు.