సువెన్ చేతికి కాస్పర్ ఫార్మా
ఫార్ములేషన్లను తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ కాస్పర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌ను (సీపీపీఎల్) సువెన్ ఫార్మా సొంతం చేసుకోనుంది. కాస్పర్ ఫార్మాకు చెందిన 100 శాతం వాటాను దాదాపు రూ.155 కోట్లకు కొనుగోలు చేయడానికి సువెన్ ఫార్మా బోర్డు ఆమోదం తెలిపింది. వాటా కొనుగోలు తర్వాత సువెన్ ఫార్మాకు కాస్పర్ ఫార్మా వందశాతం అనుబంధ సంస్థ అవుతుంది. కాస్పర్‌కు ఏడాదికి 120 కోట్ల టాబ్లెట్లు/క్యాప్సుల్స్ తయారు చేసే సామర్థ్యం కలిగిన యూనిట్ ఉంది. ఈ యూనిట్‌ను వచ్చే ఆరు నెలల్లో USDFA తనిఖీ చేసి ఆమోదం తెలిపే వీలుంది. 30 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని సువెన్ ఫార్మా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి వేంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై (ఎల్ఓఐ) సంతకాలు చేశారు.