స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి కాస్త బలహీనంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయి 18,089ని తాకిన నిఫ్టి వెంటనే 18047ని పడింది. ఇపుడు 18056 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిన్న నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ భారీ లాభాలతో ట్రేడవగా, నిఫ్టి మిడ్ క్యాప్ స్వల్ప లాభాలకే పరిమితమైంది. ఇవాళ నిఫ్టి కన్నా నిఫ్టి మిడ్ క్యాప్ అధిక లాభాలతో ట్రేడవుతోంది. నిన్న భారీగా పెరిగిన హెచ్డీఎఫ్సీ ట్విన్స్‌లో స్వల్ప ఒత్తిడి వస్తోంది. ఈ రెండు షేర్లు ఒక శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి బ్యాంక్‌లో కూడా లాభాల స్వీకరణ కన్పిస్తోంది. ఫార్మా కౌంటర్లలో గట్టి మద్దతు కన్పిస్తోంది.