For Money

Business News

తొలివారం కలెక్షన్స్‌ రూ.710 కోట్లు

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తొలివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 710 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇందులో రూ. 560 కోట్లు మనదేశంలో కలెక్ట్‌ కాగా, మిగిలిన మొత్తం విదేశాల్లో వసూలు చేసింది. కరోనా తరవాత హిందీ మార్కెట్‌లో తొలివారం అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డు సృష్టించింది. తొలి వారం మొత్తం రూ. 132.59 కోట్లు వసూలు చేసింది. విడుదలైన రోజు రూ. 20.07 కోట్లు, 26న రూ. 24 కోట్లు, 27న రూ.31.50 కోట్లు, సోమవారం రూ. 17 కోట్లు, మంగళవారం రూ. 15.02 కోట్లు, బుధవారం రూ.13 కోట్లు, గురువారం రూ.20 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా రూ. 560 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా హిందీలో రూ. 132 కోట్లు వసూలు చేసింది. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా కలెక్షన్స్‌ రూ. 428 కోట్లు.