For Money

Business News

BOX OFFICE: ద బ్యాట్‌మన్‌ను మించిన ఆర్‌ఆర్‌ఆర్‌

ప్రపంచ వ్యాప్తంగా గతవారం మూడు మెగా సినిమాలు విడుదలయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్‌, ద బ్యాట్‌మ్యాన్‌, ద లాస్ట్‌ సిటీ. తొలి వారంలో అంటే మార్చి 25 నుంచి 27 ఆదివారం వరకు మూడు రోజుల్లో ఆర్ఆర్‌ఆర్‌ మూవీ 6 కోట్ల డాలర్లు (రూ. 470 కోట్లు), ద బ్యాట్స్‌మ్యాన్‌ మూవీ 4.55 కోట్ల డాలర్లు, ద లాస్ట్ సిటీ 3.5 డాలర్ల కలెక్షన్స్‌ సాధించాయి. అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్స్‌ గురించి ద ఫోర్బ్స్‌ పత్రిక కూడా రాసింది. ట్రేడ్‌ అనలిస్ట్‌ ట్వీట్ ప్రకారం తరణ్‌ ఆదర్శ్‌ ప్రకారం మూడు రోజుల్లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరింది. హిందీ బెల్ట్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ మల్టిప్లెక్స్‌ కంటే బీ, సీ సెంటర్లలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో నడుస్తోంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ గుజరాత్‌ రికార్డు కలెక్షన్స్‌తో సాగుతోంది. మాస్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుండటంతో సోమవారం కూడా మంచి కలెక్షన్స్‌తో సినిమా నడుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల వరకు అధిక రేట్లతో టికెట్లు అమ్ముకునే ఛాన్స్‌ ఉండటంతో… చాలా సెంటర్లలో అయిదు షోలు వేసేందుకు అవకాశం ఉన్నా… నాలుగు షోలు మాత్రమే వేస్తున్నారు. దీంతో అధిక రేట్లతో ఈ సినిమా నడుస్తోంది.