For Money

Business News

17,400పైన నిఫ్టి

బ్యాంకులు, ఫైనాన్షియల్‌ అండతో నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. 17442ను తాకిన తరవాత నిఫ్టి ఇపుడు 17407 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 92 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి తొలి ప్రతిఘటన వద్ద వెనక్కి వచ్చేసింది. ట్రేడింగ్‌ సెషన్‌ కొనసాగే కొద్దీ నిఫ్టి ఈ స్థాయిని కూడా బ్రేక్‌ చేసి రెండో ప్రతిఘటన స్థాయి 17498ని దాటుతుందేమో చూడాలి. నిఫ్టికి నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి ఫైనాన్షియల్‌ నుంచి గట్టి మద్దతు లభించింది. నిఫ్టి బ్యాంక్‌కి ప్రధాన ఒత్తిడి 36700పైన రానుంది. మరి ఈ సూచీ కూడా ఇక్కడి నుంచి ముందుకు సాగుతుందా లేదా ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే రేపు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. ఇవాళ నిఫ్టి మిడ్ క్యాప్‌ కూడా 0.9 శాతం, నిఫ్టి నెక్ట్స్‌ 0.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఫార్మా షేర్లు వెలుగులో ఉన్నాయి.