For Money

Business News

NIFTY TODAY: ఈ లాభాలు నిలబడుతాయా?

కీలక అంశాలను మార్కెట్ డిస్కౌంట్‌ చేసేశాయి. సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ప్రారంభమైతే… ఓపెనింగ్‌లోనే 17200 స్థాయిని దాటినట్లే. నిఫ్టి క్రితం ముగింపు 16975. నిఫ్టిలో అప్‌ బ్రేకౌట్‌ 17170 దాటితో మొదలౌతుంది. సో… మార్కెట్‌లో ర్యాలీ కొనసాగనుంది. కాకపోతే బుల్‌ ర్యాలీ కొనసాగాలంటే నిఫ్టి కనీసం 17,300 స్థాయిని దాటాలి. ఈ సిరీస్‌లో నిఫ్టి 17500ను టచ్‌ చేస్తుందని కొందరు టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. అయితే నిఫ్టిలో వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్స్‌ నేడు. అలాగే మూడు రోజులు మార్కెట్‌ ఉండదు. కాని ఈ వారంలో అయిదు వీక్లీ సెటిల్‌మెంట్స్‌ వస్తాయి. అంటే మంత్లీ సెటిల్‌మెంట్‌ ఇంకా రెండు వారాల దూరంలో ఉంది. కాబట్టి వెంటనే ఒత్తిడి వస్తుందా అన్నది అనుమానమే. గ్యాప్‌ అప్‌తో మార్కెట్‌ ప్రారంభమైనపుడు డే ట్రేడర్లకు పెద్ద అవకాశాలు రావు. కాని బై ఆన్‌ డిప్‌ ఫార్ములా పాటించినవారందరూ భారీగా లాభపడ్డారు. మరి వీక్లీ క్లోజింగ్‌ కారణంగా ఇవాళ కూడా అలాంటి ఛాన్స్‌ వస్తుందా అన్నది చూడాలి. నిఫ్టి 17120పైన ఉన్నంత వరకు పరవలేదు. 17100 దిగువన ఒత్తిడి ఉండొచ్చు. మిడ్‌ సెష్‌న్‌లో డే ట్రేడర్స్‌కు ఏమైనా ఛాన్స్‌ వస్తుందేమో చూడాలి.