AP: టికెట్ల ధరలపై ఏ క్షణమైనా జీవో
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల విషయమై తెలుగు సినిమా పరిశ్రమ కోరిక తీరనుంది. టికెట్ల ధరల పెంపునకు సంబంధించిన ఫైల్‌పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టినట్లు ఏబీఎన్ న్యూస్ ఛానల్ పేర్కొంది. టికెట్ల ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఒకటి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సదరు కమిటీ నివేదిక ఆధారంగా సీఎం వద్దకు అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనికి కొన్ని సవరణలు చేసి సీఎం ఓకే చేశారు. ఇదే అంశాన్ని కోర్టుకు తెలిపిన తరవాత ప్రభుత్వం జీవోను జారీ చేయొచ్చని తెలుస్తోంది. ఉత్తర్వులు ఇవాళ లేదా రేపు వచ్చేస్తాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పలువురు సినీ పెద్దల భేటీ తరవాత జీఓ వచ్చేస్తుందని భావిస్తున్నా.. జీవో రాలేదు. ఈలోగా పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ విడుదలైపోయింది. ఈనెల 11వ తేదీన ప్రభాస్ నటించిన రాదేశ్యామ్, 25న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల తరఫున ప్రభాస్, రాజమౌళి ఇటీవల సీఎంను కలిసిన విషయం తెలిసిందే. పరిస్థితి చూస్తుంటే … ప్రభాస్ సినిమా విడుదలకు ముందే టికెట్ల ధరలకు సంబంధించిన జీవో వచ్చేస్తుందని సమాచారం.