బయోకాన్ భారీ డీల్
బయోసిమిలర్స్ బిజినెస్‌లో భారీ డీల్‌కు బయోకాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వయాట్రిస్ కంపెనీకి అమెరికాలో ఉన్న బయోసిమిలర్ బిజినెస్‌ను టేకోవర్ చేసేందుకు ఆ కంపెనీతో బయోకాన్ డీల్ చేసుకుంది. తన అనుబంధ సంస్థ బయోకాన్ బయోలాజిక్స్ ద్వారా ఈ కంపెనీని టేకోవర్ చేస్తోంది. ఈ డీల్ విలువ 333.5 కోట్ల డాలర్లు. కొంత క్యాష్తో పాటు ఈక్విటీ ద్వారా ఈ డీల్‌ను ఓకే చేసింది. ఈ ఒప్పందానికి వయాట్రిస్ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ఒప్పందంలో భాగం 233.5 కోట్ల డాలర్లను నగదుగా బయోకాన్ చెల్లిస్తుంది. డీల్ కుదిరిన వెంటనే 200 కోట్లు, మిగిలిన మొత్తం 2024లోగా చెల్లిస్తారు. మరో 100 కోట్ల డాలర్లకు సమానమైన కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫెరెన్స్ షేర్స్‌ను కేటాయించనుంది. ఈ డీల్‌తో కొత్త ఉత్పత్తులు బయోకాన్ బయోలాజిక్స్ చేతికి వస్తాయి. బయోకాన్ బయోలాజిక్స్ వ్యాక్సిన్స్ కోసం ఇప్పటికే సీరమ్ ఇన్స్టిట్యూట్ లైఫ్ సైన్సస్తో ఒప్పందం కుదుర్చుకుంది.