క్రాంప్టన్ చేతికి బటర్‌ఫ్లయ్
చెన్నైకు చెందిన బటర్‌ఫ్లయ్ గాంధిమతి అప్లయన్సస్‌ను క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ టేకోవర్ చేసింది. రూ. 2076 కోట్లకు ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. కొంత మంది ఇన్వెస్టర్ల నుంచి 55 శాతం వాటాను రూ.1403 కోట్లకు క్రాంప్టన్ కొనుగోలు చేసింది. మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. దీంతో మొత్తం వాటా కోసం క్రాంప్టన్ రూ. 2076 కోట్లు చెల్లించనుంది. డీల్ తరవాత బటర్‌ఫ్లయ్ కంపెనీ షేర్ రూ.1404 వద్ద ట్రేడవుతోంది. రూ. 1433 ధరకు క్రాంప్టన్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది.