NIFTY TRADE: 17,043 కోల్పోతే…
మార్కెట్ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. అంటే పుట్స్ చాలా అధిక ప్రీమియంతో ప్రారంభమౌతాయి. ముఖ్యంగా ఈ నెల డెరివేటివ్స్ ప్రీమియం చాలా పెరిగే అవకాశముంది. ఈ ప్రీమియం కాస్త చల్లబడే వరకు ఆగండి. అంటే నిఫ్టి కాస్త కోలుకునే వరకు ఆగాలి. ఆ తరవాత 16800 పుట్ కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారని వీరేందర్. అయితే 17100 స్టాప్‌లాస్‌తో నిఫ్టి ట్రేడ్ చేయమని అంటున్నారు. కాల్ రైటింగ్ 17500 వద్ద అధికంగా ఉంది. అలాగే పుట్ రైటింగ్ 17000 ప్రాంతంలో ఎక్కువగా ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు నిన్న కూడా భారీ అమ్మారు. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ తగ్గించారు. నిఫ్టికి బేస్ జోన్ 17111, 17043. ఈ స్థాయిలను కోల్పోతే 16982, 16910 స్థాయిలను చూసే వీలుంది. 17000-17043 స్థాయిలను గమనించమని వీరేందర్ సలహా ఇస్తున్నారు. ఇతర లెవల్స్‌ను వీడియోలో చూడండి.
https://www.youtube.com/watch?v=Mk_aE8MMB-Y