ఇండిగో బోర్డు నుంచి తప్పుకున్న రాకేష్
ఇండిగో విమాన కంపెనీ మాతృ సంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ నుంచి కంపెనీ ప్రమోటర్ రాకేష్గంగ్వాల్ తప్పుకున్నారు. బోర్డుకు రాజీనామా చేశారని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఈ మేరకు ఆయన బోర్డుకు లేఖ రాశారు. ఇంటర్ గ్లోబ్ రానున్న అయిదేళ్ళలో వాటా తగ్గించుకోవాలని అనుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ కంపెనీ 15 ఏళ్ళ పాటు ప్రయాణం చేశానని, ఏదో ఒక రోజు తన వాటా తగ్గించుకోవాలని ఆలోచన రావడం సహజమని ఆయన అన్నారు. అయితే కంపెనీ షేర్ ధరను ప్రభావితం చేసే సమాచారాన్ని తనకు ఇవ్వొద్దని ఆయన కంపెనీని కోరారు. భవిష్యత్తులో తను కంపెనీ బోర్డులో మళ్ళీ రావొచ్చని అన్నారు.