For Money

Business News

బటర్‌ఫ్లయ్‌లో హావెల్స్‌కు వాటా?

అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించాలని భావిస్తున్న బటర్‌ఫ్లయ్‌ గాంధిమతి అప్లయన్సస్‌ లిమిటెడ్‌ రూ. 500 కోట్ల మేర నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీలో వాటా తీసుకునేందుకు హావెల్స్‌తో పాటు పలు ఇతర కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ మార్‌క్వి కూడా వాటా తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు కంపెనీ ఆసక్తి చూపడం లేదు. ఈ వార్తలతోనే గడచిన ఆరు నెలల్లో కంపెనీ షేర్‌ 50 శాతంపైగా పెరిగింది. ఇవాళ కూడా రూ.1340ని తాకి ఇపుడు రూ. 1288 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ గత ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీన రూ.476 వద్ద ఉండేది. అంటే పది నెలల్లో షేర్‌ దాదాపు మూడు రెట్లు పెరిగిందన్నమాట.