నష్టాలతో అదానీ విల్మర్ లిస్టింగ్?
మరికాస్సేపట్లో అదానీ విల్మర్ షేర్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానుంది. ప్రి మార్కెట్ డీలింగ్స్ చూస్తుంటే షేర్ డిస్కౌంట్‌తో లిస్ట్ కానుంది. ప్రస్తుతం రూ. 227.80 వద్ద షేర్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. రూ.227 వద్ద కేవలం 2 లక్షల మంది మాత్రమే కొనుగోలుదారులు ఉన్నారు. అయితే లిస్టయిన తరవాత ధరలో హెచ్చతగ్గులు ఉండొచ్చు. అయితే ఇపుడు ఆఫర్ చేస్తున్న ధర దృష్ట్యా ఈ షేర్ డిస్కౌంట్‌లో లిస్ట్ కానుంది. ఈ షేర్‌ను ఇన్వెస్టర్లకు రూ.230లకు ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్ ఇవాళ కాస్త గ్రీన్‌లో ఉన్నందున ఆఫర్ ధరను దాటే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు.