ప్రీమియంతో లిస్ట్ కానున్న అదానీ విల్మర్
ఫార్చ్యూన్ బ్రాండ్ పేరుతో వంటనూనెలతో పాటు ఇతర ఆహార పదార్థాలను మార్కెట్ చేసే అదానీ గ్రూప్ కంపెనీ అదానీ విల్మర్ షేర్లు రేపు లిస్ట్ కానున్నాయి. ఒక్కో షేర్‌ను ఈ కంపెనీ రూ.230 చొప్పున ఆఫర్ చేసింది. రేపు ఈ షేర్ కనీసం రూ. 265 ప్రాంతంలో అంటే 15 శాతం ప్రీమియంతో లిస్ట్ అవుతుందని భావిస్తున్నారు. జనవరి 31వ తేదీతో ముగిసిన ఈ ఇష్యూ 17 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. అయితే ఉద్యోగులకు కేటాయించిన కోటా మాత్రం కేవలం సగమే సబ్‌స్క్రియిబ్ అయింది. దీంతో ఈ షేర్ ప్రీమియం నిలబడుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఐటీ షేర్లు వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో చాలా మంది ఎఫ్‌ఎంసీజీ షేర్లపై ఆశలు పెట్టుకున్నారు. అదే కోవలో అదానీ విల్మర్ కూడా పెరుగుతుందేమో చూడాలి.