For Money

Business News

టాటా స్టీల్‌ లాభంలో 139% వృద్ధి

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్‌ రూ. 9,598 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 139 శాతం పెరిగింది. అయితే 2021 సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే నికరలాభం 23.5 శాతం క్షీణించింది. ఇక కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ. 60,783 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో రూ. 2,790 కోట్లను మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టినట్లు కంపెనీ తెలిపింది.