యూనిలివర్ బిడ్ తిరస్కరణ
ఫైజర్ కలిసి తాము నిర్వహిస్తున్న తమ కంపెనీలోని కన్జూమర్ హెల్త్‌కేర్ వస్తువుల యూనిట్‌ను గ్లాక్సోస్మిత్ క్లెన్ (జీఎస్కే) అమ్మకానికి పెట్టింది. ఈ యూనిట్ కొనేందుకు యూనిలీవర్ వేసిన 50 6,840 కోట్ల బిడ్‌ను తిరస్కరించినట్లు జీఎస్కే వెల్లడించింది. గత డిసెంబరు 20 న చివరగా వేసిన బిడ్‌ను కూడా తిరస్కరించినట్లు జీఎస్కే ఓ ప్రకటనలో పేర్కొంది. తమ యూనిట్ విలువను, వాటి భవిష్యత్ అంచనాలను తక్కువగా చూపుతూ బిడ్ దాఖలు చేసినందునే… తిరస్కరించినట్లు జీఎస్కే తెలిపింది. పెయిన్ కిల్లర్ అడ్విల్, సెన్సొడైన్ టూత్‌పేస్ట్, టమ్స్ను కలిసి ఓ యూనిట్‌గా విడగొట్టి అమ్మాలని జీఎస్కే నిర్ణయించింది. నొవిర్తిస్, ఫైజర్లతో కలిసి ఈ విభాగాన్ని నిర్వహిస్తోంది. 2021లో ఈ విభాగం 1,310 కోట్ల డాలర్ల టర్నోవర్‌ను సాధించింది.