అరబిందో ఫార్మా నుంచి మోల్నుపిరవిర్
డాక్టర్ రెడ్డీస్ తరవాత మోల్నుపిరవిర్ క్యాప్సుల్స్‌ను హైదరాబాద్ ఫార్మా కంపెనీలైన అరబిందో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ మన మార్కెట్ విడుదల చేశాయి. అరబిందో ఫార్మా ‘మోల్నాఫ్లూ’ బ్రాండు పేరుతో, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ‘మోలులో’ పేరుతో ఈ క్యాప్సుల్స్‌ను విక్రయిస్తాయి. ఈ ఔషధాన్ని కొవిడ్-19 చికిత్సలో వినియోగించడానికి ఇటీవల మనదేశంలో అత్యవసర అనుమతి లభించిన విషయం విదితమే.